Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సుబ్రతో రాయ్ పై ఇంకు చల్లిన ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీం

సహారా సంస్థల అధినేత సుబ్రతో రాయ్ ముఖంపై నిన్న (మంగళవారం) సుప్రీంకోర్టు బయట మనోజ్ శర్మ అనే న్యాయవాది ఇంకు చల్లిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనను పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఈ ఘటనను ఈ రోజు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. దానిపై వివరణ ఇవ్వాలంటూ న్యాయవాదికి నోటీసు పంపింది.

More Telugu News